Janavaradhi | Online News


డ్రగ్స్‌ కేసు: క్లీన్ చిట్ తీసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీ


సుదీర్ఘ విరామం తరువాత టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసును విచారించిన సిట్ అధికారులు తాజాగా నాలుగు చార్జీషీట్లు దాఖలు చేశారు. సుమారు 62 మంది సినీ ప్రముఖల నుంచి గోర్లు,వెంట్రుకలు, రక్త నమూనాలు సేకరించిన అధికారులు వివిధ పరీక్షలు నిర్వహించారు. పోలీసులు నమూనాలు సేకరించిన వారిలో హీరోయిన్ చార్మితో పాటు దర్శకుడు పూరి జగన్నాధ్‌, సుబ్బరాజు,తనీష్‌, రవితేజ, తరుణ్‌ ఉన్నారు. అయితే తాజాగా సిట్ దాఖలు చేసిన చార్జీషీట్లలో వీరి పేర్లు ఎక్కడా కనిపించలేదు. తాజా పరిణామాలతో సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్‌ వచ్చినట్టేనని భావిస్తున్నారు. అయితే తూతూమంత్రంగా చార్జీ‌షీట్లు దాఖలు చేసినట్టు పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
 

POLL