Janavaradhi | Online News


పటాస్‌ షో నుండి శ్రీముఖి తప్పుకుందా...?


ప‌టాస్ అనే కార్యక్రమంతో ఒక్కసారిగా పాపుల‌ర్ అయింది శ్రీముఖి . రాముల‌మ్మగా శ్రీముఖి ఫుల్ ఫేమస్ అయ్యింది . ప‌టాస్ షోలో శ్రీముఖి త‌న మాట‌ల‌తోనే కాదు అటు గ్లామ‌ర్‌తోను అల‌రించింది. స్టూడెంట్స్‌తో ఈ అమ్మడు చేసే ఫ‌న్ ఆడియ‌న్స్‌ని రంజింపజేసింది. ప‌టాస్ కార్యక్రమం ఫుల్ హిట్ కావ‌డంతో ఈ మ‌ధ్య శ్రీముఖి, ర‌వి హోస్ట్‌గా ప‌టాస్ 2 కూడా మొద‌లు పెట్టారు. అయితే ప‌టాస్ షోకి కొద్ది రోజులు తాను బ్రేక్ ఇవ్వబోతున్నట్టు వీడియో ద్వారా తెలిపింది శ్రీముఖి. నిర్వాహకుల అనుమతితోనే తాను బ్రేక్ తీసుకుంటున్నట్టు పేర్కొంది. త‌న‌ని ఇంత‌గా ఆద‌రించిన బుల్లితెర ప్రేక్షకుల‌కి కూడా ఈ విష‌యం తెలియాల‌నే ఈ వీడియో చేస్తున్నట్టు తెలిపింది శ్రీముఖి. ప‌టాస్ షో త‌న హృద‌యానికి చాలా ద‌గ్గరైంద‌ని చెబుతూ, నిర్మాణ సంస్థ మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసింది.
 
 





POLL