Janavaradhi | Online News


రవిప్రకాశ్‌కు నేడే డెడ్‌లైన్...!


టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఆరో రోజు మంగళవారం కూడా పోలీసుల నోటీసులకు స్పందించలేదు. 41 సీఆర్‌పీసీ నోటీసు గడువు బుధవారం ముగియనుంది. దీంతో ఆయన పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా విచారణకు హాజరవుతారా? లేక పోలీసులకు చిక్కి అరెస్టవుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అలంద మీడియా సంస్థ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు ఈ నెల 9న రవిప్రకాశ్‌ ఇంట్లో సైబర్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. 
 
ఆయనపై ఫోర్జరీ, డేటాచోరీ కేసులు నమోదు చేశారు. దాడులు జరిగిన నాటి నుంచి ఆయన కనిపించకుండాపోయారు. దాంతో వెంటనే పోలీసులు ముందు హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు 160 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులకు స్పందించకుండా కాలయాపన చేస్తున్న రవిప్రకాశ్‌ రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అలంద మీడియా సంస్థ ప్రతినిధులతో మధ్యవర్తుల ద్వారా మాట్లాడి వారు పెట్టిన కేసులను వెనక్కి తీసుకునేలా ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

POLL