Janavaradhi | Online News


జైల్లోనే మాయమయిన మారుతీరావు తమ్ముడి ఉంగరాలు


సాధారణగా దొంగతనం చేస్తే జైల్లో పెడతారు . అలాంటిది జైల్లోనే దొంతతనం జరిగింది . ఇక్కడ విచిత్త్రం ఏంటంటే నేరస్థుల సొమ్మే పోయింది . ఇక వివరాల్లోకి వెళ్తే అప్పట్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యలో నిందితులు అయిన మారుతీరావు మరియు అతని తమ్ముడు శ్రవణ్ ల ఉంగరాలు మాయం అయ్యాయి.. హత్యకేసులో భాగంగా నల్గొండ జిల్లాకి వచ్చిన సమయంలో వారి దగ్గరి నుండి ఆరు లక్షలు విలువ చేసే మూడు డిమాండ్ ఉంగరాలను స్వాదీనం చేసుకున్నారు .
 
ఇక అక్కడినుండి వరంగల్ జైలుకి తరలించారు. ఇటివల విడుదల అయిన మారుతీరావు మరియు శ్రవణ్ ల యొక్క స్వాదీనం చేసుకున్న డిమాండ్ ఉంగరాలను తిరిగి ఇవ్వాలని జైలు అధికారాలను కోరారు . అయితే అ ఉంగరాలు లేవని జైలు అధికారులు బదులు ఇచ్చారు . అయితే దీనిపైన మారుతీరావు కుటుంబసభ్యులు జైలు అధికారి జైలేందర్ పై మరియు అజయ్ , అనిల్ కుమార్ లపై కేసు నమోదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఖచ్చితంగా తిరిగి ఇస్తామని అధికారులు చెబుతున్నారు ..
 





POLL