Janavaradhi | Online News


సైకో శీనుగాడిని ఉరి తీయండి.. శ్రావణి తల్లిదండ్రుల ఆమరణ దీక్ష


నల్గొండ : నరరూప రాక్షసుడు, మానవ మృగం హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అభం శుభం తెలియని అమ్మాయిలను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. శ్రావణి హత్యోదంతంతో వెలుగుచూసిన సైకో శీనుగాడి లీలలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. సైకో శీనుగాడి పంజాకు హాజీపూర్‌కు చెందిన ముగ్గురు అమ్మాయిలు బలయ్యారు. దాంతో వాడి ఇల్లును గ్రామస్తులు తగులబెట్టారు. ఆ తర్వాత మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ఆ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. న్యాయం జరుగుతుందని వేచి చూసిన బాధితులకు నిరాశే మిగిలింది. ఆ క్రమంలో బొమ్మల రామారం మండల కేంద్రంలో సైకో శీనుగాడిని ఉరి తీయాలంటూ శ్రావణి తల్లిదండ్రులు ఆమరణ దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగేలా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 

POLL