Janavaradhi | Online News


మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయ్...వైఎస్ జగన్!


మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయని, మీ అందరి దీవెనలే శ్రీరామరక్షగా ఉన్నాయని ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల చేరుకున్న జగన్‌ బుధవారం తన కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచే ప్రజాదర్బార్‌లో పాల్గొన్నారు. ఈ ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో అనేక మంది వారి వ్యక్తిగత సమస్యలను జగన్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనందరికి మంచి రోజులు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానన్నారు. మీ అందరి దీవెనలే శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. అన్ని వర్గాలకు ఏమాత్రం వ్యత్యాసం లేకుండా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఒక మహిళ తన బిడ్డకు అనారోగ్యం చేసిందని వైద్యం చేయించాలని కోరగా జగన్‌ స్పందిస్తూ 29 లేదా 30 తేదీల్లో తనను కలవాలన్నారు. వైద్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆ మహిళకు జగన్‌ హామీ ఇచ్చారు.
 





POLL