Janavaradhi | Online News


అజ్ఞాతం నుంచి వెలుగులోకొచ్చిన‌ రవిప్రకాశ్....


టీవీ9 వ్య‌వ‌హారంలో వివాదాస్ప‌దమై అజ్ఞాతంలో ఉన్న ర‌వి ప్ర‌కాశ్ వీడియో సందేశం విడుద‌ల చేసారు. టీవీ9 స్థాప‌న ద‌గ్గర నుండి అమ్మ‌కం వ‌ర‌కు చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను వివ‌రించారు. జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు త‌న‌ను పాలేరుగా ఉండ‌మ‌న్నార‌ని..బెదిరింపుల‌కు గురి చేసార‌ని..త‌ప్పుడు కేసులు న‌మోదు చేసార‌ని చెప్పుకొచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. తాను ముందడుగు వేయాల‌ని నిర్ణ‌యించాన‌ని ర‌వి ప్ర‌కాశ్ స్ప‌ష్టం చేసారు. కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈఓ ర‌వి ప్ర‌కాశ్ త‌న వివ‌ర‌ణ‌ను వీడియో సందేశం ద్వారా వినిపించారు. తాను టీవీ9 స్థాపించిన స‌మ‌యంలో శ్రీనిరాజు పెట్టుబ‌డి పెట్టార‌ని..కొద్ది కాలం క్రితం ఆయ‌న లాభాల‌తో బ‌య‌ట‌కు వెళ్లాన‌ని చెబితే తాను అంగీక‌రించాన‌ని చెప్పుకొచ్చారు.
 
 తిరిగి పెట్టుబ‌డుదారుల కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా మెగా కృష్ణారెడ్డి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి మిత్రుల‌తో క‌లిసి పెట్టుబ‌డి పెడ‌తాన‌ని చెబుతూ..ఎడిటోరియ‌ల్ స్వేచ్చ ఇస్తాన‌ని మాట ఇచ్చార‌ని చెప్పారు. అయితే, ఆయ‌న మై హోం రామేశ్వ‌ర‌రావును మెజార్టీ వాటా దారుడిగా తీసుకు రాగా, అదే విషయాన్ని కృష్ణారెడ్డిని ప్ర‌శ్నించాన‌న్నారు. రామేశ్వ‌ర‌రావుతో సైతం తాను ఒక మైనార్టీ స్టేక్ హోల్డ‌ర్ అని..అగ్రిమెంట్ అస‌వ‌ర‌మ‌ని చెప్పాన‌ని వివ‌రించారు. కానీ, రామేశ్వ‌ర రావు మాత్రం త‌న‌ది కుటుంబ వ్యాపారం అని చెబుతూ.. నీతో ఎటువంటి రాత పూర్వ‌క ఒప్పందం చేసుకోలేన‌ని స్ప‌ష్టం చేసారన్నారు. నీవు పాలేరులా ప‌ని చేసుకో.. జీతం తీసుకొని నీ ప‌ని నీవు చేసుకో అని హెచ్చ‌రించార‌ని ర‌వి ప్ర‌కాశ్ చెప్పుకొచ్చారు.
 

POLL