Janavaradhi | Online News


కుమార్తె స్నేహితురాలిపై అత్యాచారం...


తన కూతురు స్నేహితురాలిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిపై నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారంనికి చెందిన హలీమ్‌ మేకర్‌ మహ్మద్‌ షరీఫ్‌(40) గతంలో బొగ్గులకుంటలో నివసించేవారు. కాగా అక్కడి నుండి వచ్చేసి ప్రస్తుతం బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే బొగ్గులకుంటలో ఉన్నప్పుడు అతని కుమార్తె స్నేహితురాలు(20) అప్పుడప్పుడు షరీఫ్ ఇంటికి వస్తుఉండేది. తన కూతురు, స్నేహితురాలు సరదగా మాట్లాడుకునే వారు. ఈ క్రమంలోనే మహ్మద్‌ షరీఫ్ కన్ను తన కూతురి స్నహితురాలి మీద కన్నుపడింది.
 
ఈ నేపథ్యంలో ఒకరోజు అ అమ్మాయి షరీఫ్ ఇంటికి వచ్చింది. ఆరోజు తన స్నేహితురాలు ఇంట్లో లేదు. ఇదే సరైనా సమయం అనుకున్నా షరీఫ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. అమ్మాయి తన తలిదండ్రులకు జరిగింది చెప్పాగా షరీఫ్‌ను నీలదీశారు. దీంతో తన కుమార్తేను పెళ్లిచేసుకుంటానని అన్నాడు. కానీ ఆ తరువాత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. చివరకు ఆ అమ్మాయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు షరీఫ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో షరీఫ్ సోదరుడు మహ్మద్ చాంద్ బాధిత కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వారు ఫలక్‌నుమా ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును నారాయణగూడ ఠాణాకు బదిలీచేశారు. పోలీసులు షరీఫ్‌, చాంద్‌పై కేసు నమోదు చేసి, మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

POLL