Janavaradhi | Online News


అల్లరి నరేష్ ఇంట్లో విషాదం ..


ప్రముఖ నటుడు అల్లరి నరేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది .. అయన నాయినమ్మ మరియు ఈవివి సత్యనారాయణ వాళ్ళ అమ్మ అయిన ఈదర వెంకటరత్నమ్మ మంగళవారం మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడిలోని నివాసంలో ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సన్నిహితులు వెల్లడించారు... ఆమెకి ప్రస్తుతం 87 సంవత్సరాలు .. ఈవివి సత్యనారాయణ మరణించిన తరవాత ఆమె హైదరాబాద్ ని విడిచి తన సొంత గ్రామం అయిన నిడదవోలు సమీపంలోని కోరుమామిడి వెళ్లిపోయి గత 8 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. వెంకటరత్నమ్మ ఏజ్ రిలేటెడ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. వెంకట‌రత్నమ్మ అంత్యక్రియలు కోరుమామిడిలో మంగళవారం నిర్వహించారు. అల్లరి నరేష్‌, ఆర్యన్‌ రాజేష్‌తో పాటు దర్శకుడు సత్తిబాబు, నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు, ఈవివి కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
 





POLL