Janavaradhi | Online News


సినిమా చూపించి రైతులను సన్మానించిన మహర్షి టీం ..


మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "మహర్షి ".. ఈ సినిమా ఇప్పటికే ఘన విజయం సాధించింది .. ఇటీవలె ఈ మూవీ వందకోట్లను కలెక్ట్‌ చేసినట్టు నిర్మాతలు కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రం దర్శకుడు ఐన వంశీ పైడిపల్లి తన సొంత గ్రామమైన ఖానాపూర్‌లోని లక్ష్మీ థియేటర్‌లో సందడి చేశారు. అక్కడి రైతులకు మహర్షి సినిమాను ఉచితంగా చూపించారు .అంతేకాకుండా చిత్రయూనిట్‌ రైతులను ఘనంగా సన్మానించింది. ఈ సందర్బంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ తాను పుట్టిన ఊర్లోనే నా సినిమాని రైతులకు చూపించి ఇదే సినిమా హాల్లో రైతులను సన్మానించడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు.
 





POLL