Janavaradhi | Online News


ఆర్ ఆర్ ఆర్ : ఇంటర్వెల్ సీన్ కోసం 45 కోట్ల ఖర్చు .. !


బాహుబలి సినిమా తరవాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఇందులో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు తారక్ లపై సన్నివేశాలు చిత్రికరిస్తున్నాడు దర్శకుడు .. అయితే సినిమా ఇంటర్వెల్ లో భాగంగా వచ్చే పోరాట సన్నివేశాలను సుమారుగా 45 కోట్ల ఖర్చుతో చిత్రికరిస్తున్నట్టు టాక్ .. ఈ ఎపిసోడ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తుంది.. దీనిలో ఎన్టీఆర్ చరణ్ తో పాటు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పోరాట సన్నివేశంలో పాల్గొననున్నట్టు సమాచారం.ఈ సినిమాను 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. జూలై 30 2020లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.





POLL