Janavaradhi | Online News


థియేటర్లో కొట్టి బయటకు తోశారు: వంశీ పైడిపల్లి!


ఒకప్పుడు సాధారణ ప్రేక్షకుడిలా మహేష్ బాబు సినిమాలు చూసిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఇపుడు అదే హీరోతో 'మహర్షి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ దర్శకుడి నుంచి బయటి ప్రపంచానికి తెలియని ఆసక్తికర విషయాలు రాబట్టారు అలీ.  మా అమ్మానాన్నలది కరీంనగర్‌ జిల్లా జగిత్యాల సమీపంలోని బీమారం. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో థియేటర్‌ కొన్న తర్వాత అక్కడే స్థిరపడ్డారు. థియేటర్ కొన్న నాలుగు నెలల తర్వాత నేను పెట్టానట. నా చదువు బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో సాగింది. సెలవులకు ఇంటికి వెళితే థియేటర్లోనే ఎక్కువ సయం గడిపేవాడినని వంశీ పైడిపల్లి గుర్తు చేసుకున్నారు.
 
 
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాలపై పిచ్చితో అసిస్టెంట్‌ డైరెక్టర్ అయినా చాలు అనుకుని వచ్చా. ‘భద్ర' సినిమాకు పని చేస్తున్నపుడే దిల్ రాజుగారు కథ రాసుకో చేద్దాం అన్నారు. అపుడే ‘మున్నా' కథ రాశాను. రాజుగారి వల్ల 26 ఏళ్లకే ఈజీగా దర్శకుడిని అయ్యాను. ప్రభాస్, రాజుగారు నన్ను నమ్మి సినిమా చేశారు. అయితే నా తొలి సినిమా హిట్ కాలేదని వంశీ తెలిపారు. నేను కాలేజీ రోజుల్లో థియేటర్లో దెబ్బలు తిన్నాను. నాకు మామూలుగా సినిమా చూడటం రాదు. ప్రతి సీనుకు అతిగా స్పందిస్తాను. అలా ఒకసారి థియేటర్లో గోల చేస్తుంటే నన్ను కొట్టి బయటకు పంపారు. ఇపుడు అదే థియేటర్లో ‘మహర్షి' ఆడుతుందని వంశీ తెలిపారు.





POLL