Janavaradhi | Online News


NGK మీద స్పందించిన హీరో సూర్య


సౌత్ స్టార్ సూర్య నటించిన NGK మూవీ తెలుగుతో పాటు తమిళంలో మే 31న విడుదలైంది. అయితే రెండు ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి నెగెటివ్ రెస్సాన్సే రావడంతో అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ ఫలితాలపై తాజాగా సూర్య స్పందించారు. సినిమా ఫెయిల్యూర్‌ను స్వీకరిస్తూ సూర్య ట్వీట్ చేశారు. 'NGK సినిమా విషయంలో అందరి అభిప్రాయాలను వినయంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సినిమా లోపాలను ఎత్తి చూపడంతో పాటు, డిఫరెంట్ అటెమ్ట్ చేసినందుకు ప్రశంసించిన మాస్టర్ మైండ్స్(క్రిటిక్స్)కు ఈ సందర్భంగా సూర్య థాంక్స్ చెప్పారు.
 
ఈ సినిమాలో భాగమైన నటీనటులకు, టెక్నీషియన్లకు, దర్శకుడు సెల్వరాఘవన్, నిర్మాత ఎస్ఆర్ ప్రభుకు సూర్య కృతజ్ఞలు తెలిపారు. సినిమా ప్లాప్ అయిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకున్న సూర్యపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. NGK మూవీ తమిళనాడు బాక్సాఫీసు వద్ద తొలి 5 రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే నెగెటివ్ టాక్ కారణంగా తొలి వారంలోనే బిజినెస్ క్లోజ్ అయింది. ఇది లాస్ వెంచర్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. ఇక తెలుగు నాట సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్‌లో ఒకటి రెండు మినహా దాదాపు అన్ని థియేటర్ల నుంచి ఎత్తేశారు.
 





POLL