Janavaradhi | Online News


శ్రీకాకుళం నుంచి మొదలైన ఏపీ క్యాబినెట్ ప్రమాణస్వీకారం..


ఏపీ క్యాబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం వెలగపూడిలోని సచివాలయం ప్రాంగణంలో ప్రారంభమైంది. తొలుత ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు ప్రమాణం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో అప్పలనాయుడుతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.49 నిమిషాలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ముందుగా క్యాబినెట్‌లో చోటుదక్కిన వారి పేర్లను ప్రకటించారు. వారితో పదవీ స్వీకార ప్రమాణం, రహస్య పరిరక్షణ ప్రమాణం చేయాలని సూచించారు. 
 
ముందుగా శ్రీకాకుళం నుంచి మంత్రుల పదవీప్రమాణస్వీకారం ప్రారంభించారు. క్యాబినెట్‌లో చోటుదక్కిన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్ తొలి మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత విజయనగరం జిల్లా చీపురపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, కురపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌)లతో గవర్నర్ ప్రమాణస్వీకారంతో చేయించారు. అనంతరం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎమ్మెల్యే పినిసే విశ్వరూప్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ వద్దకు వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు.





POLL