Janavaradhi | Online News


ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం....


ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం ప్రారంభమైంది. 8 అంశాల అజెండాతో కేబినెట్ భేటీ జరుగుతోంది. వృద్ధాప్య పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాల పెంపుపై చర్చిస్తారు. ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి ఇవ్వడంపై , సీపీఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ విలీనం, వైెఎస్సార్ రైతు భరోసాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండాను రూపొందించారు. అలాగే అక్టోబర్‌ 15 నుంచి అమలు చేయనున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు.
 

POLL