Janavaradhi | Online News


డీజీపీకి ఫిర్యాదు.. త్వరలో సీఎం జగన్‌ను కలుస్తానన్న యామిని


టీడీపీ నేత యామిని సాథినేని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులతో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన ఫేరుతో నకిలీ అకౌంట్ సృష్టించి ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన పేరుతో రెండు ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నట్లు యామిని చెబుతున్నారు. కానీ తన పేరున కొన్ని నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు సృష్టించారని.. మార్చిలోనే దీనిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. మళ్లీ కొద్దిరోజులుగా తన పేరుతో తప్పుడు పోస్టులు పెట్టారని.. కొందరైతే తనకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. 
 
అలాగే ఈ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ల వ్యవహారంపై గతంలోనే ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశానని.. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిని కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తానన్నారు. తన సమస్యను సీఎంకు వివరిస్తానని చెప్పారు. ఆదివారం తిరుపతి వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు జగన్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఈ సందర్భంలో జగన్ ప్రధానికి పాదాభివందనం చేయబోగా.. మోదీ వారించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై విమర్శలు చేస్తూ.. యామిని సాధినేని పేరుతో ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అయ్యింది. వైసీపీ నేతలు యామిని ఫేస్‌బుక్ అకౌంట్ అనుకొని మండిపడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 





POLL