Janavaradhi | Online News


యువీ రిటైర్మెంట్‌పై సెహ్వాగ్ ట్వీట్‌!


అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువీకి.. త‌న తోటి స‌హ‌చ‌రుల నుంచి గ్రీటింగ్ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. డాషింగ్ ఓపెన‌ర్ సెహ్వాగ్‌.. యువీని గుర్తు చేసుకున్నాడు.`ఆట‌గాళ్లు వ‌స్తుంటారు.. పోతుంటారు. కానీ, యువ‌రాజ్ లాంటి ఆట‌గాళ్లు చాలా అరుదు. యువీ ఎన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాడు. భ‌యంక‌ర‌మైన వ్యాధిపై, మైదానంలో బౌల‌ర్ల‌పై సునాయాసంగా పైచేయి సాధించాడు. అంద‌రి హృద‌యాల‌నూ గెల్చుకున్నాడు. పోరాట ప‌టిమ‌, ప‌ట్టుద‌ల‌తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన యువీకి శుభాకాంక్ష‌లు` అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. యువీతో క‌లిసి ఉన్న త‌న ఫోటోను కూడా షేర్ చేశాడు.
 

POLL