Janavaradhi | Online News


కాంగ్రెస్ పార్టీ మారే ప్రసక్తే లేదు...కోమటిరెడ్డి


కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలకనేతలు బీజేపీ తీర్థంపుచ్చుకోనున్నట్లు, అప్పుడే బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు జోరుగా ఊపందుకున్నాయి. అయితే ఈ క్రమంలో నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మారబోతున్నారని తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీ మారే ప్రసక్తే లేదని, అపలు తాను పార్టీ మారేందుకు బీజేపీ నేత రాంమాధవ్‌ను కలిశానని అనడం పూర్తి అవాస్తవమని కొట్టిపారేశారు. అసలు రాంమాధవ్‌ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. అసలు ఇప్పటివరకు రాంమాధవ్ చూడను కూడా లేదని చెప్పారు. భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడిగా భువనగిరి అభివృద్ది కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. నాపై ఎంతో నమ్మకంతో భువనగిరి ప్రజలు నన్ను గెలిపించారని వల్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ప్రజల కోరకై నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.

POLL