Janavaradhi | Online News


అదృశ్యమైన దాసరి తనయుడు...


ప్రముఖ సినీదర్శకుడు దివంగత నేత దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు అదృశ్యమయ్యారు. ఆయన ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీనిపై ప్రభు కుటుంబీకులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, దాసరి ప్రభుకు, భార్య సుశీలకు గతంలో అనేక వివాదాలున్నాయి. ఆస్తి వివాదం నేపథ్యంలో 2008లో కూడా ఓసారి ఇలాగే కనిపించకుండాపోయారు. ఆపై అనూహ్యంగా తెరపైకి వచ్చి తన భార్య సుశీలే తనను కిడ్నాప్ చేయించిందని ఆరోపించారు. దాసరి ప్రభు, సుశీల ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా, ఆయన అదృశ్యం వెనుక కుటుంబపరమైన కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు.