Janavaradhi | Online News


నంద‌మూరి బాల‌కృష్ణ కొత్త సినిమా ప్రారంభం


ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం తరువాత నంద‌మూరి బాలకృష్ణ కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. 2018లో ‘జై సింహా’ చిత్రంతో హిట్ కొట్టిన బాలయ్య.. ఆ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్ రిపీట్ చేశారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలతో గురువారం నాడు షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు స‌న్నివేశానికి వి వి వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా.. బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వహించారు. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ప‌రుచూరి ముర‌ళి క‌థ‌ను అందిస్తుండగా.. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. రామ్‌ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 





POLL