Janavaradhi | Online News


చంద్రబాబు ఫ్యామిలికి తగ్గిన భద్రతా సి‍బ్బంది..


ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జడ్ కేటగిరి భద్రత కలిగి ఉన్న చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లోకేష్‌కు 2+2 గన్‌మెన్లను కేటాయించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లోకేశ్‌కు 5+5 భద్రత ఉండేది. ఇదిలా ఉంటే.. లోకేష్‌ను మినహాయిస్తే మిగిలిన కుటుంబసభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. చంద్రబాబు విదేశీ పర్యటనను ముగించుకుని రాగానే ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా భద్రతను ఉప సంహరించారని సమాచారం.
 
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కనీస సమాచారం ఇవ్వకుండా భద్రత ఎలా తొలగిస్తారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పాదయాత్ర చేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం భద్రత విషయంలో ఎక్కడా పక్షపాతం చూపలేదని, కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి రాగానే చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ విమర్శించింది.





POLL