Janavaradhi | Online News


నన్నుముందుకు నడిపించండి...ఐఏఎస్ ల‌తో జగన్!


‘కొత్తగా అధికారంలోకి వచ్చాను. నాకు అనుభవం లేదు. అన్నలూ మీరంతా నన్ను ముందుకు నడిపించండి. ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేద్దాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులకు పిలుపునిచ్చారు. ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో సోమవారం రాత్రి విజయవాడ కృష్ణానది ఒడ్డున బరంపార్కులో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం జగన్‌ సతీమణి భారతితో కలిసి పాల్గొన్నారు. ఐఏఎస్‌ అధికారులు కూడా కుటుంబ సభ్యులతో సహా కార్యక్రమానికి విచ్చేశారు.
 
 సీఎం జగన్‌ దంపతులకు మన్మోహన్‌సింగ్‌ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విందుకు ముందు ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘నాకు అధికారం కొత్త. సుబ్రహ్మణ్యం అన్న (సీఎస్‌), గౌతమ్‌ అన్న (డీజీపీ), మన్మోహన్‌ అన్నలు నన్ను ముందుండి నడిపించాలి. నేను తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా లోటుపాట్లు కనిపిస్తే సుబ్రహ్మణ్యం అన్న, గౌతమ్‌ అన్న గైడ్‌ చేస్తారు. అన్నలు అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మంచి చేద్దామనుకుంటన్న నాకు మీరంతా సహకరించాలి’ అని జగన్‌ కోరినట్లు తెలిసింది.

POLL