Janavaradhi | Online News


హాట్ హాట్ గా కల్కి ట్రైలర్!


శేఖర్ బాబును ఎవరు చంపారు? ఇదీ ప్రశ్న. సమాధానం కావాలంటే జూలై 28 వరకూ ఆగాల్సిందే నంటున్నాడు కల్కి. పాపం.. నటుడు రాహుల్ రామకృష్ణ ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఎందరినో కలిశాడు.. కానీ లాభం లేకపోయింది. చివరికి అది ఎవరో చెప్పాల్సింది నేనే అంటూ హీరో రాజశేఖర్ చెప్పారు. అయితే, కల్కి సినిమాలోనే ఆ విషయం తెలుస్తుందట. ఇదంతా కల్కి సినిమా ట్రైలర్ సందడి. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ ట్రైలర్ ఎట్టకేలకు నేట్టింట్లో హడావుడి మొదలు పెట్టింది. ఆకాశవాణి వార్తలతో మొదలైన ట్రైలర్.. చంపిందెవరో చెప్పాల్సింది నేనే అన్న రాజశేఖర్ డైలాగ్ తో ముగిసింది. కనీ, ఈ మధ్యలో వచ్చిన చిన్ని..చిన్ని కట్ సీన్స్ సినిమా పై అంచనాల్ని అమాంతం పెంచేసేలా ఉన్నాయి. నిజానికి ట్రైలర్ ఓ చిన్నపాటి సినిమా చూసినంత ఉత్కంత రేపింది.
 





POLL