Janavaradhi | Online News


వార్తలు రాస్తే వేధిస్తారా..?


జనవారధి పాత్రికేయునిపై 
పాఠశాల యాజమాన్యం దురుసు ప్రవర్తన‌


జనవారధి,ఫిరంగిపురం:ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పుస్తకాల అమ్మకాలు,భారీ ఫీజులు వంటి అంశాలను స్ధానిక జనవారధి పాత్రికేయుడు ప్రై "వేటు'' పడేనా..శీర్షికతో వచ్చిన వార్తా కధనం పట్ల స్ధానిక పాఠశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది.మండల కేంద్రంలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాత్రికేయుడిని యాజమాన్యం చుట్టుముట్టి భయాందోళలను గురిచేయటం పట్ల జనవారధి యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తుంది.ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరంకుశ వైఖరి సమంజసం కాదని,వార్తలో అవాస్తవాలుంటే మండల విద్యాధికారి లేదా ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు.అంతేగానీ పాత్రికేయులను భయభ్రాంతులకు గురిచేయటం సరైన పద్దతి కాదు.ఈ సంఘటన పట్ల పలువురు పాత్రికేయులు ఖ‍ండిస్తున్నారు.

 
 





POLL