Janavaradhi | Online News


సంక్షేమం,సుపరిపాలన అందిస్తాం:ఎమ్మెల్యే అంబటి


సత్తెనపల్లి,జనవారధి: కార్యకర్తలను కాపాడుకుంటూనే సకల జనానికి సంక్షేమం,సుపరిపాలన అందిస్తూ మీ మనసు దోచుకుంటామని,అంతేగానీ మీ జేబులు దోచుకోమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు.మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సామావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సమావేశానికి ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు.
 
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఒత్తిడి లేని విధి నిర్వహణకు అధికారులకు అవకాశం కల్పిస్తామన్నారు.మీకు ఇబ్బంది లేనంత వరకు ప్రజలకు సేవలందించాలని సూచి‍ంచారు.గత పాలకులు ఏఏ తప్పులు చేశారో సాధ్యమైన‍ంత వరకు వాటికి దూరంగా ఉంటామన్నారు.ఆదాయ వనరుల కోసం గత మార్గాలను మా నాయకులు,కార్యకర్తలు గుర్తు చేస్తున్నారని, అది మంచి పద్దతి కాదని సున్నితంగా తిరస్కరిస్తున్నామన్నారు.తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చేలా జనరంజక పాలన అందిస్తామన్నారు.
 
అతి పిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన జగన్మోహనరెడ్డి అవినీతి ప్రక్షాళనలో చాలా సుస్పష్టంగా ఉన్నారన్నారన్నారు.సమీక్షలు నిర్వహిస్తున్న పద్దతి,హామీలను అమలు చేస్తున్న విధానం,శాఖల ప్రక్షాళనకు తీసుకుంటున్న నిర్ణయాలను మీరు గమనిస్తూనే ఉన్నారన్నారు.ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సమర్ధవంతమైన పాలన అందించాలని ఆయన ఆకాంక్షింస్తున్నారన్నారు.రెండు,మూడు సర్వసభ్య సమావేశాల్లో నేను పాల్గొన్నానని స్ధానికంగా ఉన్న సమస్యలు  మా దృష్టికి వస్తున్నాయన్నారు.కొంత సమయం తీసుకుని పరిష్కరిస్తామన్నారు.మంచినీటి సరఫరా,పగలే వెలుగుతున్న వీధి దీపాలు ఇలాంటివి ఉన్నాయన్నారు.ఎంపిడివో అనురాధ‌,ఎమ్మార్వో సీతారామయ్యలు ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించారని ప్రత్యేకంగా అభినందించారు.
 
ముందుగా పలు శాఖల అధికారులు ఎమ్మెల్యే రాంబాబును ఘనంగా సత్కరించి సన్మానించారు.శాఖల వారీగా ఎంపిడివో అనురాధ సమీక్ష నిర్వహించారు.పలువురు ఎంపిటీసిలు మంచినీరు,పారిశుధ్యం తదితర సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పలువురు కౌలు రైతులకు ఎల్ ఇసి కార్డులు ఎమ్మెల్యే అంబటి అందించారు. సమావేశంలో సూపరిండెంటెండ్ విలియమ్స్,సిడిపివో ప్రసన్న,ఎంఇవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 





POLL