Janavaradhi | Online News


హీరో రాజశేఖర్‌కు తీవ్ర అస్వస్థత....


గరుడ వేగ సక్సెస్‌తో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చారు. వేగంగా సినిమాలు చేస్తూ మళ్లీ రేసులో పరుగులు పెడుతున్నారు. తాజాగా ఆయన నటించిన కల్కి సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే అనూహ్యంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిలిపి వేయడంతో అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న కనీసం ప్రచారం చేయకపోవడంపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకు ప్రమోషన్ నిలిపి వేయడానికి కారణమేమిటంటే..
 
కల్కి ప్రమోషన్ కార్యక్రమాలు నిలిపి వేయడంపై ఆరా తీయగా.. హీరో రాజశేఖర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హై ఫీవర్‌ సమస్య ఆయనను ప్రమోషన్స్‌కు దూరంగా ఉంచింది. కనీసం మాట్లడం, నడవడం చేయలేకపోతున్నారు. దాంతో నిర్మాతలను ప్రమోషన్ కార్యక్రమాలను రద్దు చేయమని కోరారు అని సినీ వర్గాలు వెల్లడించాయి. హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, లేకపోతే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశాలు లేకపోలేవని వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
 





POLL