Janavaradhi | Online News


విజయనిర్మల మృతి..,శోకసంద్రంలో కృష్ణ


సినీనటి విజయనిర్మల భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, బంధువులు పెద్ద సంఖ్యలో నానక్‌రామ్‌ గూడ నివాసానికి చేరుకుంటున్నారు. ఇటు అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విజయ నిర్మల భౌతిక కాయంపై పూలమాలల వేసి నివాళలులర్పించారు. తనతో కష్టసుఖాల్లో కలిసి ఉన్న విజయనిర్మల ఇక లేదు అన్న విషయం తెలుసుకున్న కృష్ణ కన్నీరుమున్నీరవుతున్నారు. విజయనిర్మల భౌతిక కాయం పక్కనే కూర్చుని విషాదంలో మునిగిపోయారు.శోకసంద్రంలో మునిగిపోయిన కృష్ణను ఆయన కుమారుడు మహేష్ బాబు ఓదారుస్తున్నారు. విజయనిర్మల భౌతిక కాయాన్ని చూస్తూ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 





POLL