Janavaradhi | Online News


బిగ్ బాస్ 3 హోస్ట్ గా అక్కినేని నాగార్జున...


బిగ్ బాస్ 3 : బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరు అన్న దానిపై గత కొద్దీ రోజుల నుండి సస్పెన్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే .. అ మధ్య కూడా ఓ ప్రోమోను విడుదల చేసింది బిగ్ బాస్ టీం. కానీ అ ప్రోమో లో ఉన్న వ్యక్తిని మాత్రం చూపించి చూపించనట్టు వదిలేసింది.. కానీ అ వాకింగ్ స్టైల్ , అ హైట్ ని చూస్తే మాత్రం ఇతను పక్కా కింగ్ నాగార్జుననే అని ఫాన్స్ ఐతే గట్టిగానే ఫిక్స్ అయ్యారు .. అయితే తాజాగా ఈ సస్పెన్స్ కి శుభం కార్డు వేసింది బిగ్ బాస్ టీం. సీజన్ 3 కి సంబంధించిన మరో వీడియోను రిలీజ్ చేసింది . ఇందులో నాగార్జున ఓ మార్కెట్ కి వస్తాడు .. తనకి కావాల్సిన వస్తువులను కొనుకుంటాడు ..
 
 అక్కడి వాళ్ళు మీరేంటి ఇక్కడికి వచ్చారు సార్ అంటే ' ఈసారి నేనే రంగం లోకి దిగాను అని అంటాడు నాగ్ ' సో .. ఈ సీజన్ 3 కి తానే హోస్ట్ నని చెప్పేసాడు .. అంతే కాకుండా 14 మందితో 100 రోజులు ఈ షో జరగబోతుందని ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చాడు నాగ్ .. ఇప్పటికే మొదటి రెండు సిజన్స్ ని హీరోలు ఎన్టీఆర్ మరియు నాని చేసారు .. ఇక మూడో సీజన్ భాద్యతలు నాగ్ తీసుకున్నాడు .. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ని విజయవంతం చేసినందుకు గాను బిగ్ బాస్ టీం అయన పైన ఈ భాధ్యతలను పెట్టింది ..ఇక ఈ షో జూలై మూడవ వారంలో మొదలు కానుంది ..
 





POLL