Janavaradhi | Online News


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా


వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరుగుతున్న టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. అటు బంగ్లా ఏడు పాయింట్లతో ఉంది. ఈ జట్టు నాకౌట్‌ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌తో పాటు పాక్‌పైనా నెగ్గాలి. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు మ్యాచ్‌లో టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. కేదార్‌ జాదవ్‌కి బదులు దినేశ్‌కార్తీక్‌ బరిలో దిగుతుండగా కుల్‌దీప్‌కి బదులు భువనేశ్వర్‌కు అవకాశమొచ్చింది.
 
భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, బుమ్రా, చహల్‌ 
బంగ్లాదేశ్‌: మష్రాఫ్‌ మొర్తజా(కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకీబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటాన్‌ దాస్‌, మొసదెక్‌ హుస్సేన్‌, షబ్బీర్‌ రహ్మాన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, రూబెల్‌ హుస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌
 

POLL