Janavaradhi | Online News


భారీ స్కోరుకి బాటలు వేస్తున్న భారత్...


బంగ్లాదేశ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా ఈరోజు జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్నభారత్ జట్టు భారీ స్కోరుకి బాటలు వేసుకుంది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మ (51 నాటౌట్: 46 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీ సాధించాడు. అతనికి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (32 నాటౌట్: 45 బంతుల్లో 4x4) సహకారం అందిస్తుండటంతో.. భారత్ జట్టు 15.1 ఓవర్లు ముగిసే సమయానికి 88/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తుది జట్టులో కోహ్లీ రెండు మార్పులు చేశాడు. 
 
ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో పేలవంగా విఫలమైన కేదార్ జాదవ్‌పై వేటు వేసి దినేశ్ కార్తీక్‌కి అవకాశమిచ్చాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని తప్పించి.. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌ని తుది జట్టులోకి తీసుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లాడిన భారత్ జట్టు ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. మరోవైపు ఏడు మ్యాచ్‌లాడిన బంగ్లాదేశ్ జట్టు మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం ఏడు పాయింట్లతో ఉన్న ఆ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. 





POLL