Janavaradhi | Online News


బావకు రావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు... డిస్కో శాంతి


దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరికి ఇండస్ట్రీలో చాలా మంది డబ్బులు ఎగ్గొట్టేవారని, ఆయన మరణించిన తర్వాత అప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు సంబంధించి రెమ్యూనరేషన్‌గా రావాల్సిన డబ్బు చాలా మంది ఇవ్వకుండా ముఖం చాటేశారనే వాదన ఉంది. ఈ అంశంపై శ్రీహరి వైఫ్ డిస్కో శాంతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. బావ ముందు నుంచి డబ్బులకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. ఆయన రూపాయికి డీల్ మాట్లాడితే... 20 పైసలు తీసుకుని 80 పైసలు వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ అంతే. లేకుంటే ఇలాంటి బిల్డింగులు, ఆస్తులు చాలా చాలా ఉండేవి... అని డిస్కో శాంతి తెలిపారు.
 
మా నాన్న కూడా ప్రొడ్యూసర్. వాళ్లు కష్టాలు నేను దగ్గరుండి చూశాను. సినిమా కోసం దర్శక నిర్మాతలు చాలా కష్టపడతారు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. సినిమా ఆడక పోతే చాలా నష్టం వస్తుంది. నేను కూడా ఇలాంటి విషయాలను లైట్ తీసుకునే దాన్ని. ఇద్దరి ముగ్గురి దగ్గరకు డబ్బుల కోసం పంపించాను. ఇవ్వని వారిని చీపో అని వదిలేశాను... అని డిస్కో శాంతి గుర్తు చేసుకున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారే నా ప్రపంచం. ఉదయం 5 గంటలకు లేచి బావకు పాలు కలిపి ఇచ్చి... పిల్లలకు వంట చేయడం, వాళ్లను స్కూలుకు పంపడం, బావకు ఫుడ్ రెడీ చేసి పెట్టడం ఇలా నా లైఫ్ స్టైల్ సాగిపోయేది. ఇంట్లో ఉన్నపుడు బావ చాలా కామెడీ చేసేవారు, నవ్వించే వారు, ఇంటికి అందరూ వచ్చేవారు... సందడిగా ఉండేదని డిస్కోశాంతి గుర్తు చేసుకున్నారు.
 





POLL