Janavaradhi | Online News


ప్రతీ అపజయం విజయానికి దారే: పవన్ కల్యాణ్!


తానా మహా సభలో జనసేనానీ  పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ... చిన్నప్పటి నుంచి నేను నటుడిని అనే భావన నాకు లేదు.. జీవితమే నన్ను నటుడిని చేసింది.తానా మహాసభల వేదికగా నా ఓటమికి గురించి మనస్సు విప్పి మాట్లాడుతున్నా.. ప్రతీ అపజయం విజయానికి దారే అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎవరైనా సమాజంలో బాధపడితే.. అది నన్ను చాలా బాధపెట్టేది.. ఈ భావనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్నారు. నేను చాలా ఆలోచించిన తర్వాతే జనసేన పార్టీ పెట్టా,దేశసమగ్రతకే భంగం కలుగుతుందనే భయం నాలో ఉండేది.. ఉన్న రాజకీయ నేతలు ఎవరూ గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది.. సరికొత్తతరానికి యువతలో ఉన్న ఆవేదనను గలం విప్పడానికే జనసేన పార్టీని పెట్టానని 
పవన్ కల్యాణ్ తెలిపారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి.. ప్రతీసారి భయపడుతుంటే ముందుకు వెల్లలేమన్నారు.యువత ఆవేదన బయటకు చెప్పకపోతే నేను తప్పుచేసినవాడిని అవుతానని ఆయన చెప్పారు.





POLL