Janavaradhi | Online News


ఐసీసీ ర్యాంకింగ్స్ : తొలి రెండు స్థానాలు భారత్ వే...


అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను భారత క్రికెటర్లు కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకును భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్కించుకోగా, రెండో స్థానంలో భారత పరుగుల యంత్రం రోహిత్ శర్మ ఉన్నాడు. ఇకపోతే, ఐసీసీ వన్డే ర్యాంకుల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో టీమిండియా బౌలర్ జస్పీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ట్రెంట్ బౌల్ట్, మూడో స్థానంలో కమ్మిన్స్, రషీద్ ఖాన్, కుల్దీప్ లు సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు.
 

POLL