Janavaradhi | Online News


ఎఫ్‌ఆర్‌వో అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు


కుమ్రంబీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో అటవీ అధికారులపై దాడులు చేసిన కోనేరు కృష్ణప్ప వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఘటనలో అటవీ అధికారులపై సర్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎఫ్‌ఆర్వో అనితతోపాటు మరో 15మందిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఫారెస్ట్ అధికారి అనిత, ఇతర సిబ్బంది తనను కులం పేరుతో ఉద్దేశపూర్వకంగా దూషించి, దాడి చేయడంతోపాటు దుర్భాషలాడినట్టు సర్సాల గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అటవీ భూములను స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారి అనితపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
 





POLL