Janavaradhi | Online News


వరల్డ్ కప్ ఫలితంపై యువరాజ్ సింగ్ షాకింగ్ ట్వీట్ !


వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ ఫలితంపై యువరాజ్ సింగ్ విస్మయం వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహించిన మ్యాచ్ ఫలితం డ్రా అయితే ఎక్కువ బౌండరీలు కొట్టిన టీంనే విజేతగా ప్రకటించే ఐసీసీ బౌండ్రీ రూల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యువీ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. తాను ఈ రూల్‌తో ఏకీభవించనని యువరాజ్ సింగ్ బాహాటంగా ప్రకటించాడు. కానీ.. రూల్స్ రూల్సే కాబట్టి వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు తెలిపాడు. కివీస్ వీరోచిత పోరాటం చేసిందని యువీ కితాబిచ్చాడు. ఈ పద్ధతిలో విజేతను నిర్ణయించడం సరైన విధానం కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ కూడా అభిప్రాయపడ్డాడు. ఈ రూల్‌ను మార్చాల్సిన అవసరం ఉందని బ్రెట్ లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.





POLL