Janavaradhi | Online News


మొక్కలు నాటిన సమిత్రి ఫౌండేషన్ సభ్యులు


సత్తెనపల్లి,జనవారధి : పర్యావరణ పరిరక్షణ కోసం భావితరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాద్యత ఉందని సమిత్రి ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.సోమవారం  రైల్వే గేట్ వద్ద ఉన్న పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో వంద మొక్కలు  నాటారు. ఈ కార్యక్రమంలో షైక్ హాసన్, రాజీవ్ గాంధీ, సధిక్, లక్ష్మణ్ రాఘవ, అష్వాక్, నగూర్,న్.బ్ సైదులు, సయ్యద్ మీరా పాఠశాల పి. టి మాస్టర్  శ్రీనివాస్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.ముప్పాళ్ళలో.. ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సురేష్,ఏఎస్సై షణ్మిఖంలు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మొక్కలు నాటటంతో పాటు సంరక్షణ పట్ల కూడ శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ పరిధిలోని కానిస్టేబుల్స్,సిబ్బంది తదితరులున్నారు.





POLL