Janavaradhi | Online News


అక్రమ‌ రేషన్ బియ్యం స్వాధీనం:ఎస్సై


సత్తెనపల్లి, జనవారధి : మరికొద్ది రోజుల్లో రేషన్ దుకాణాల వ్యవస్ధ రద్దు చేస్తూ వాలంటీర్ల వ్యవస్ధను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.రేషన్ దుకాణాలు కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్న డీలర్లు ఓవైపు ఉద్యమం చేస్తూనే ఉన్నారు.మరోవైపు ఈ సంధి కాలాన్ని అనుకూలంగా చేసుకుని రేషన్ దుకాణానికి వస్తున్న బియ్యం,కందిపప్పులను వినియోగదారులకు పూర్తి స్ధాయిలో పంపిణీ చేయకుండానే అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.మండల పరిధిలోని ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతం నుండి అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది.అయినా రేషన్ మాఫియా ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.సోమవారం భృగుబండ గ్రామంలో   తురక శ్రీనివాసరావు నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 రేషన్ బస్తాలను రూరల్ ఎస్సై మౌనీష ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు.సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
 

POLL