Janavaradhi | Online News


మురికి కాల్వల శుభ్రం చేసిన‌ ప్రజ్వలన బృందం


సత్తెనపల్లి,జనవారధి :పట్టణంలోని 21వ వార్డ్ విశ్వ బ్రాహ్మణ స్మశాన ప్రాంతం వద్ద మురికి కాలవలో వ్యర్ధాలతో నిండిపోయి నీరు పారుదల ఆగిపోయింది. దీన్ని గమనించిన ప్రజ్వలన సేవా సంస్ద బృందం కాల్వను వ్యర్ధాలను తీసి శుభ్రం చేసారు.అనంతరం వారు మాట్లాడుతూ.. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మురుగు కాల్వల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా నిలిచిన వ్యర్ధాలను తక్షణమే తొలగించాలని వారు కోరారు. కాల్వల పూడికతీత పనులు తరచు చేపట్టాలని బృందం డిమాండ్ చేసింది.పట్టణంలోని పలు సేవా సంస్ధలకు భిన్నంగా ప్రజ్వలన బృందం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది.





POLL