Janavaradhi | Online News


జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్....


జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లా సోపోరీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైనికులు సోదాలు మొదలు పెట్టారు. సోదాలు చేస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పలు కొనసాగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలను నిలిపివేశారు. కాగా, అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భద్రత కట్టుదిట్టంగా ఉన్నా ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది రెండో సారి.
 

POLL