Janavaradhi | Online News


మా అబ్బాయి రిటైర్ అయితే మంచిదంటున్న ధోనీ తల్లిదండ్రులు?


ధనా ధన్ ధోనీ! ఈపేరు వింటేనే టీమిండియా క్రికెట్ ప్రేమికులు ఊగిపోతారు. ధోనీ ఎన్నోఏళ్లుగా భారత క్రికెట్ మూలస్తంభంలా నిలిచాడు. తన వలన జట్టుకు ఎంతవరకూ ప్రయోజనం అనే దానిపై చక్కని క్లారిటీ ఉన్న ఆటగాడు. తన ఆటతీరు టెస్ట్ లకు సరిపోవడం లేదని భావించిన వెంటనే.. ఆ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆదర్శప్రాయుడు. ఇప్పుడు ధోనీ పరిమిత ఓవర్ల ఆటతీరుపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. మునుపటి వేగం తగ్గిందంటూ కొందరు అదేపనిగా మాట్లాడుతున్నారు. ధోనీ రిటైర్ అయితే మంచిదని కొందరు.. లేదు ఇంకొన్ని రోజులు ఆడాలని మరికొందరు నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. వరల్డ్ కప్ సెమీస్ లో ధోనీ ఆటతీరు చూశాకా చాలామంది ధోనీ విలువైన ఆటగాడన్న విషయాన్ని ఒప్పుకున్నారు. వరల్డ్ కప్ నుంచి బయటకు రాగానే ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, వాటిని ధోనీ కొట్టిపారేశాడు. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ధోనీ రిటైర్మెంట్ విషయమే చర్చగా ఉంది.





POLL