Janavaradhi | Online News


పార్టీ మారేదే లేదు : జూపల్లి క్రిష్టారావు


తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి క్రిష్టారావు క్లారిటీ ఇచ్చారు. తాను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కొందరు అదేపనిగా సోషల్‌ మీడియాను ఉపయోగిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న వారికి భవిష్యత్తులో తడిన గుణపాఠం చెబుతునానని హెచ్చరించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేస్తానని జూపల్లి క్రిష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నారని జూపల్లి తెలిపారు.
 





POLL