Janavaradhi | Online News


24 గంటలు గడిస్తేగానీ చెప్పలేం


24 గంటలు గడిస్తేగానీ చెప్పలేం
ఐసియూలో అంతుబట్టని  వైద్యం
పసిపిల్లలనూ వదలని వ్యాపారం
ధనార్జన కోసమే ఓ వైద్యుని హడావుడి..?
సత్తెనపల్లిలో హద్దులు మీరుతున్న వైద్య వ్యాపారం
 
సత్తెనపల్లి,జనవారధి:రోగి బంధువుల ఆందోళనే వైద్యులకు పెట్టుబడి.ప్రాణాలు నిలుపుకునేందుకు రోగులు పడే తపనే వైద్యశాలలకు రాబడి.ఇదే ఆసరాగా తీసుకుని కొంతమంది వైద్యులు ప్రతీ దానికీ ఐసియూ అంటున్నారు.24గంటలు గడిస్తే గానీ చెప్పలేమంటారు.తెల్ల కాగితం మీద మందులు రాసిస్తారు.నిబంధనలకు విరుద్ధంగా మందుల షాపులు నిర్వహిస్తారు.ఇక్కడ కొన్న మందులు ఐసియూలోకి తీసుకెళ్తారు.అక్కడ వాడతారో లేదో తెలియని పరిస్ధితి.ఇదంతా చాలా సినిమాల్లో చూసుంటాం.కానీ ప్రత్యక్షంగా సత్తెనపల్లి పట్టణంలో అప్పుడే పుట్టిన పసిపాపతో ఇలా సిని ఫక్కీలో వైద్య నాటకమాడి మమ్మల్ని ఆందీళనకు గురి చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారో దంపతులు.
 
బాధితులు పేర్కొన్న వివరాల ప్రకారం..పట్టణంలోని ఓ ప్రముఖ వైద్యశాలలో ఓ గర్భిణీ ప్రసవించింది.అక్కడి వైద్యురాలి సూచన మేరకు ఇదే వైద్యశాలకు ఎదురుగా ఉన్న పసిపిల్లల వైద్యశాలలో చెకప్ చేయించమని సూచించారు.ఇక ఇక్కడ నుండి మొదలైంది అసలు నాటకం.సదరు పసిపిల్లల వైద్యుడు అప్పుడే పుట్టిన ఆ పసి హృదయాన్ని పరీక్షించారు.హడావుడి చేశారు.వేల రూపాయల మందులు రాశారు.ఒక రోజు గడిచింది.బాబు ఆరోగ్యం గురించి దంపతులు వాకబు చేయగా 24 గంటలు గడిస్తేగానీ చెప్పలేం అన్నారు.
 
దీంతో ఖంగుతిన్న కుటుంబ సభ్యులు వైద్యున్ని ప్రశ్నించారు.ఏం వైద్యం చేశారో చెప్పాలని నిలదీశారు.అక్కడ జరుగుతున్న దానికీ,వైద్యుడు చెప్పేదానికి పొంతన లేకపోవటంతో చిన్నారి బంధువులు ఆందోళన చెంది అక్కడ నుండి గుంటూరు వైద్యశాలకు తరలించారు.గుంటూరు సమగ్ర వైద్యశాల వైద్యులు చిన్నారిని పరీక్షీంచి ఇబ్బంది ఏమీ లేదని,మీకు అనుమానం ఉంటే ఒకరోజు ఇక్కడే ఉంచవచ్చని చెప్పటం గమనార్హం.ఈ మొత్తం వ్యవహారంపై మానసికంగా ఆవేదన చె‍ంది,ఆర్ధికంగా ఇబ్బంది పడ్డ ఆ దంపతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
 
 





POLL