Janavaradhi | Online News


ఏపీ నూతన గవర్నర్ ప్రమాణస్వీకారానికి ఖరారైన డేట్...


ఏపీ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24 న ప్రమాణస్వీకారం చేస్తారు. ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు హరిచందన్‌ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయిస్తారు. మరోవైపు కొత్త గవర్నర్‌ కోసం విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేశారు. అలాగే బందరు రోడ్డులో ఉన్న బిల్డింగ్‌లో గవర్నర్‌ నివాసం, కార్యాలయం కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడైన బిశ్వభూషణ్‌ను ఏపీ కొత్త గవర్నర్‌గా నియమిస్తూ ఇటీవలే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 
 

POLL