Janavaradhi | Online News


బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయండి...ఢిల్లీలో శ్వేతారెడ్డి, గాయత్రి ధర్నా


బిగ్ బాస్ రియాల్టి షోను నిలిపి వేయాలంటూ జంతర్ మంతర్ దగ్గర సినిమా నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ధర్నా చేశారు. షో పేరుతో కాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నారనీ...  ఈ షోను బ్యాన్ చేయాలనీ...  డిమాండ్ చేశారు. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా... ఈ పద్ధతి నచ్చకే షో నుంచి బయటకొచ్చారని చెప్పారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. బిగ్ బాస్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజాన్ని రాష్ట్ర హై కోర్టులో వేశామనీ... బిగ్ బాస్ లో జరుగుతున్న విషయాలను సినీ హీరో, ప్రోగ్రామ్ హోస్ట్ నాగార్జున తెలుసుకోవాలనీ ఆయన కోరారు. బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ లో అన్యాయం జరుగుతోందని.. దీనిపైనే న్యాయపోరాటం చేస్తున్నామని యాక్ట్రెస్ గాయత్రి గుప్తా అన్నారు. 
 
సెక్సువల్ హెరాస్మెంట్, చీటింగ్.. బిగ్ బాస్ లో జరుగుతోందన్నారు. పబ్లిసిటీ కోసం వెళ్తే లీగల్ గా వెళ్లేంవాళ్ళం కాదన్నారు. బిగ్ బాస్ ముసుగులో మహిళలు, ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు యాంకర్ శ్వేతారెడ్డి. బిగ్ బాస్ సెలక్షన్ లో ఒక ప్రొడ్యూసర్ అసభ్యకరంగా మాట్లాడారనీ.. కంపెనీలపై ఉన్న నమ్మకంతో అగ్రిమెంట్ కాపీలను ముందే తాము తీసుకోలేదని చెప్పారు. తమకు జరిగిన అన్యాయంపై నాగార్జున స్పందించాలన్నారు. దేశమంతటా బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోలో జరుగుతున్న లైంగిక వేధింపులపై దేశమంతటా అందరి సహకారం కోరుతున్నామన్నారు శ్వేతారెడ్డి.





POLL