Janavaradhi | Online News


`చంద్ర‌యాన్ 2 బాహుబ‌లి`పై ప్ర‌భాస్‌ స్పంద‌న ...


యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం `బాహుబ‌లి`. ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. అంత‌ర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ఈ సినిమా పేరుని ఇస్రో శాస్త్ర్ర‌వేత్త‌లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన చంద్ర‌యాన్ 2ని విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ పెట్టిన జీఎస్ఎల్‌వీ మార్క్ 3 ఎం 1 వాహ‌కానికి పెట్టారు. ఈ ప్ర‌యోగ్రాన్ని సోమ‌వారం ఇస్రో శాస్త్ర‌వేత్తలు విజ‌య‌వంతంగా నిర్వహించారు. అనంత‌రం చంద్ర‌యాన్ 2పై బాహుబ‌లి ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.
 
``హ‌లో డార్లింగ్స్‌, చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం విజ‌య‌వంతంగా కావడం ప‌ట్ల యావ‌త్ భారతీయులు గ‌ర్వ‌ప‌డుతున్నారు. చంద్ర‌యాన్2ను క్ష‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన వాహ‌కానికి బాహుబ‌లి అనే పేరు పెట్టడం గౌర‌వంగా భావిస్తున్నాను. 300 వంద‌ల ట‌న్నుల బ‌రువైన చంద్ర‌యాన్ 2ను ప్ర‌యోగించ‌డం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది`` అన్నారు. అలాగే బాహుబలి చిత్ర యూనిట్ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఇస్రో శాస్త్రవేత్తలకు థాంక్స్ చెబుతూ, చంద్రయాన్ 2 వాహకానికి తమ సినిమా పేరు పెట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నామని తెలియజేశారు.  





POLL