Janavaradhi | Online News


అంబటిని అందుకే జట్టులోకి తీసుకోలేదు: ఎమ్మెస్కే ప్రసాద్


ఐసీసీ ప్రపంచకప్‌లో టీం ఇండియా జట్టు ఎంపిక.. బ్యాక్‌ఆప్ ప్లేయర్ల ఎంపికపై సర్వత్ర విమర్శల జట్టు కురిసిన తెరిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అంబటి రాయుడుని జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబటి రాయుడు కూడా ‘త్రిడీ’ ట్వీట్‌తో తన అసహనాన్ని చూపించాడు. ఆ తర్వాత ప్రపంచకప్ జరుగుతుండగా.. కూడా ఆటగాళ్లు గాయపడినా కూడా రాయుడు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో చేసేదేమీ లేక.. రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కాగా, ఆదివారం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీం ఇండియా వివరాలను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జట్టు చీఫ్ సెలక్టర్ అంబటి రాయుడు గురించి మాట్లాడారు. ధవన్, శంకర్ గాయపడినా.. రాయుడుని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో.. ఆయన వెల్లడించారు. 
 
‘‘సెలక్షన్‌కు సంబంధించి.. మాములు సిరీస్‌లకు, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లకు వేర్వేరు పాలసీలు ఉంటాయి. ఊహాగానాలతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టలేము. ధవన్ గాయపడినప్పుడు మాకు రిజర్వ్ ఓపెనర్ అవసరం వచ్చింది. ఆ స్థానాన్ని కేఎల్(రాహుల్) భర్తీ చేశాడు. కానీ టాప్‌ ఆర్డర్‌లో ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ లేరు. దీంతో రిషబ్ పంత్ తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. అతని సత్తా మాకు తెలుసు. అందుకే అతన్ని పిలిపించాము’’ అని తెలిపారు. అయితే విజయ్ శంకర్‌కి గాయమైనప్పుడు.. కేఎల్ రాహుల్ పరిస్థితి కూడా అనుమానస్పదంగా ఉండటం వల్లే మయాంక్‌ని ఇంగ్లండ్‌కి పంపించామని ఆయన అన్నారు. ‘‘ధవన్ తర్వాత శంకర్‌కి కూడా గాయమైంది. అయితే ఓపెనర్‌ని ఎందుకు పిలిపించారనే విషయం అందరికి అర్థం కాలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫీల్డింగ్ కూడా చేయలేకపోయాడు. అది ప్రధాన సమస్యగా మారింది. మాకు ఓపెనర్ కావాలని మెయిల్ కూడా వచ్చింది. కాబట్టి మేము ఓపెనర్ కోసం వెతికాము. కొందరు ఫామ్‌లో లేరు.. కొందరు గాయాలతో ఉన్నారు. దీంతో మయాంక్‌ అగర్వాల్‌ని జట్టులోకి తీసుకున్నాము’’ అని ప్రసాద్ స్పష్టం చేశారు.





POLL