Janavaradhi | Online News


ఇళ్ళ స్ధలాల‌ కోసం తరలివచ్చిన ప్రజానీకం


సత్తెనపల్లి,జనవారధి: సొంతింటి కల సాకారమయ్యే‍దుకు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రజానీకం రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఇళ్ళ స్ధలాల మంజూరికై దరఖాస్తులు దాఖలు చేసేందుకు తహశీల్దార్ కార్యాలయానికి పోటెత్తారు.సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమానికి 1720 దరఖాస్తులు వచ్చాయని తహశీల్దార్ రమణ కుమారి పేర్కొన్నారు.

 

నివేశన స్ధలాల కోసం దరఖాస్తు చేసేందుకు ఈ ఒక్కరోజే అవకాశముందని ప్రచారం జరగటంతో ప్రజలు మూకుమ్మడిగా కార్యాలయానికి తరలివచ్చారు.వీరందరి దరఖాస్తులు అధికారులు స్వీకరించి ఆన్ లైన్ లో నమోదు చేసి రశీదులిస్తున్నారు.ఈ రశీదుల కోసం ప్రజలు పడిగాపులు కాయటం,దరఖాస్తులు అధిక సంఖ్యలో రావటం, రసీదులు ఇవ్వటంలో జాప్యం జరగటంతో కొంత తోపులాట జరిగింది.కార్యాలయం వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయకపోవటంతో దరఖాస్తుదారులు ఒకింత సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

POLL