Janavaradhi | Online News


నా పని వెంటనే పూర్తవ్వాల్సిందే


 
నా పని వెంటనే పూర్తవ్వాల్సిందే
రూ.2లక్షలు బిల్ చేయాల్సిందే
అధికారులకు హుకుం జారీ చేసిన చోటా నేత‌
అడకత్తెరలో మున్సిపల్ అధికారులు
 
సత్తెనపల్లి,జనవారధి:అధికారికంగా ఒక్క పని చేయలేదు.వర్క్ ఆర్డర్ లేదు.ఎంబుక్ ఊసే లేదు.అసలు రూపాయి పెట్టుబడి పెట్టలేదు.అయినా సరే రూ.2లక్షలు ఏదో రకంగా వాటి బిల్ చేయాల్సిందే అంటూ మున్సిపల్ అధికారులకు హుకుం జారీ చేశాడు అధికార పార్టీ చోటా నేత.
 
అది సాధ్యం కాదని అధికారులు మొత్తుకుంటున్నా ససేమీరా అంటాడు.సున్నం కొట్టినట్టో..బ్లీచింగ్ చల్లినట్టో లెక్క రాసుకోమంటాడు.నియోజకవర్గ నాయకునికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఈయన మున్సిపల్ అధికారులపై ఈ విధంగా ఒత్తిడి తీసుకురావటంతో వారు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.ఏ ఇద్దరు వైసిపి నాయకులు కలసినా ఈ విషయమంపైనే మాట్లాడుకోవటం ఆశక్తిగా మారింది.ప్రారంభంలోనే ఇలాంటి ఆరోపణలు రాకుండా నేతలను కట్టడి చేయాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబును పలువురు కోరుతున్నారు.





POLL