Janavaradhi | Online News


తెనాలిలో వెలుగు చూసిన మరో ఆర్థిక మోసం...


గుంటూరు, జనవారధి : గుంటూరు జిల్లా, తెనాలిలో మరో ఆర్థిక మోసం వెలుగు చూసింది. ప్రజల వద్ద నుంచి వాయిదాల పద్ధతిలో వెల్ఫేర్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నగదు వసూలు చేసింది. కొన్నేళ్లుగా ఈ సంస్థ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తూ వస్తోంది. అయితే... ఖాతాదారులకు నగదు తిరిగి చెల్లించకుండా ఇబ్బందులపాలు చేస్తోంది. కార్యాలయం వద్దకు వెళ్తే సమాధానం చెప్పేవారే కరువయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్కెట్ సెంటర్‌లో బాధితులు ఆందోళనకు దిగారు.

POLL