Janavaradhi | Online News


50శాతం రిజర్వేషన్లపై వైసిపి నేతల‌ హర్షం


సత్తెనపల్లి,జనవారధి:ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టీ వర్గాలకు నియామక పదవులు,పనులలో 50శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తూ బిసి కమీషన్ ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ఆయా వర్గాల నేతలు హర్షం చేస్తున్నారు.ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని బిసి సంక్షేమ కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న యువ ముఖ్యమంత్రి పనితీరు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.మడమతిప్పని నేతగా అభివర్ణించారు.మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మాహా నేత అంబేద్కర్ ఆంకాంక్షలను నేరవేర్చేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిసి సెల్ నాయకులు వల్లెం నరసింహారావు,తుమ్మల వెంకటేశ్వర్లు,ఆర్ శివనాగేశ్వరరావు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, గాత్రం కోటేశ్వరరావు,నాయకులు అచ్యుత శివప్రసాద్,కోడిరెక్క దేవదాస్ తదితరులున్నారు.





POLL